Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార‌త్‌లో ఉద్యోగం చేయ‌డానికి ఉత్త‌మ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో గూగుల్‌, బీహెచ్ఈఎల్

  • స‌ర్వే నిర్వహించిన ఇండీడ్ వెబ్‌సైట్‌
  • ఉద్యోగి సంతృప్తి ఆధారంగా ర్యాంకింగ్‌
  • మూడో స్థానంలో ఎస్‌బీఐ, నాలుగో స్థానంలో అమెజాన్‌
భార‌త్‌లో ఉద్యోగం చేయ‌డానికి టాప్ 50 ఉత్త‌మ కంపెనీల జాబితాలో గూగుల్‌, భార‌త్ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మొద‌టి మూడు స్థానాల్లో నిలిచాయి. అంత‌ర్జాతీయ జాబ్ వెబ్‌సైట్ ఇండీడ్ త‌మ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన ఉద్యోగుల అనుభ‌వాల ఆధారంగా స‌ర్వే నిర్వ‌హించి ఈ జాబితాను వెల్ల‌డించింది.

ఈ జాబితాలో అమెజాన్ నాలుగో స్థానంలో, మారియ‌ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఐదో స్థానంలో, ఇంటెల్‌, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌, ఐబీఎం, టీసీఎస్‌, హ‌య‌త్ కంపెనీలు వ‌రుస‌గా త‌ర్వాతి స్థానాల్లోను నిలిచాయి. సంస్థ‌లో ప‌నిచేస్తున్న‌ ఉద్యోగి సంతృప్తి ఆధారంగా దాదాపు 15 మిలియ‌న్ల రివ్యూల‌ను ప‌రిశీలించి వాటిలో ఉత్త‌మ కంపెనీలకు ర్యాంకుల‌ను ఇండీడ్ వెబ్‌సైట్ కేటాయించింది.
google
amazon
best places to work
indeed
survey

More Telugu News